పల్స్ పోలియో విజయవంతం
● జిల్లాలో 96.72 శాతం నమోదు
చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్న
స్పీకర్ అయ్యన్నపాత్రుడు
అనకాపల్లి/నర్సీపట్నం: జిల్లావ్యాప్తంగా నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో 96.72 శాతం మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హైమావతి తెలిపారు. ‘మన బిడ్డల భవిష్యత్తు–మన బాధ్యత’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఐదేళ్లలోపు వయస్సు ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశామని తెలిపారు. జిల్లాలో 1,446 కేంద్రాలలో 1,97,810 మంది చిన్నారులకు గాను 1,91,319మందికి డ్రాప్స్ వేశారు. జిల్లా రూరల్ ప్రాంతాల్లో 98.07 శాతం, అర్బన్ ఏరియాల్లూ 94.59 శాతం చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆదివారం పోలియో డ్రాప్స్ వేసుకోని పిల్లలకు సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వచ్చి వైద్య ఆరోగ్య సిబ్బంది పోలియో డ్రాప్స్ వేస్తారని చెప్పారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ వీరజ్యోతి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రశాంతి, ఏరియా ఆస్పత్రి సూపరిండెంటెంట్ ఎన్.వి.సుధాశారద పాల్గొన్నారు.


