చంద్రబాబు పాలనలో చెరకు రైతు కంట తడి
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గోవాడ సుగర్ ఫ్యాక్టరీ మూతపడే స్థాయికి దిగజారిందని మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు విమర్శించారు. దేవరాపల్లి మండలంలోని బోయిలకింతాడ చెరకు కాటా వద్ద కాటా పరిధిలోని గ్రామాల చెరకు రైతులు ఆదివారం చేపట్టిన భారీ నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చెరకు బండ్లు, రైతులతో కళకళలాడాల్సిన కాటా వద్ద రైతులు ధర్నాలు చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దాపురించిందని విమర్శించారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సుగర్ ఫ్యాక్టరీకి రూ.90 కోట్ల మేర నిధులు కేటాయించి, రైతులకు, కార్మికులకు ఎన్నడూ కష్టాలు రానీయలేదని గుర్తు చేశారు. గతంలో సంక్రాంతి సీజన్‌లో రైతుల చేతిలో డబ్బులు ఉండేవని.. నేడు రెండు సీజన్లు గడుస్తున్నా పైసా విదిల్చే నాథుడు లేక రైతులు, కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారన్నారు.
– పూర్తి వివరాలు 8లో


