
బతికున్నాను మహాప్రభో..
మరణించిన తన అన్న పేరుతోపాటు తన పేరునూ రేషన్ కార్డు నుంచి తొలగించారని, ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగలేదని రాంబిల్లి మండలం అప్పన్నపాలెం గ్రామానికి చెందిన శింగంపల్లి మనోజ్‌కుమార్ పీజీఆర్‌ఎస్‌లో అర్జీ చేశారు. ఇప్పటికి చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చానని, ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. ఇటీవల ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించడంతో అలా కూడా ప్రయత్నించానని, రేషన్ కార్డు డేటాలో తన పేరు వద్ద చనిపోయినట్టు ఉందని చెప్పారు. రేషన్ కార్డు లేకపోవడంతో ఎటువంటి ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదని, తన సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నాడు.