
కలసికట్టుగా కూటమిని కూల్చాలి..
దేవరాపల్లి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గ్రామ స్థాయి నుంచి వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేసేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పార్టీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు శోభా హైమావతి అన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు అధ్యక్షతన పార్టీ మాడుగుల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం తారువ వైఎస్సార్ ఆడిటోరియంలో సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన శోభా హైమావతి మాట్లాడుతూ జగనన్న పాలనలో ప్రతి నెలా ఒక పథకం అందేదని, కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్నా పథకాలు అమలు కాక ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారన్నారు. జగనన్న చేసిన మంచిని ప్రజలకు వివరించడంతోపాటు కూటమి పాలనలో అవినీతి, అక్రమాలను నిలదీసేందుకు సిద్ధం కావాలన్నారు. ఈ నెలాఖరులోగా మండల కమిటీలను, జూలై నెలాఖరుకు గ్రామ కమిటీలు, సెప్టెంబర్ నెలాఖరుకు బూత్ కమిటీల నియామకాలను ఏకాభిప్రాయంతో పూర్తిచేయాలన్నారు. విజయవాడలో త్వరలో భారీ ప్లీనరీ నిర్వహించే ఆలోచన చేస్తున్నారన్నారు. పార్టీ సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డుతో పాటు ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు.
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సేనాపతి కొండలరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వరదపురెడ్డి లలితానాయుడు, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు సోలం రమేష్, జిల్లా ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు కె.వి.రమణ, ఎంపీపీలు చింతల బుల్లిలక్ష్మి, రెడ్డి జగన్‌మోహన్, తాళ్లపురెడ్డి రాజారామ్, కురచా జయమ్మ, జెడ్పీటీసీలు కర్రి సత్యం, కిముడు రమణమ్మ, సీడీసీ చైర్మన్ సుంకర శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీలు పంచాడ సింహాచలంనాయుడు, పొలిమేర విజయలక్ష్మి, కొత్తపల్లి శ్రీనివాస్, రొంగలి సూర్యనారాయణ, ధర్మిశెట్టి స్వాతి, కిముడు చినమ్మలు, పార్టీ మండల అధ్యక్షులు బూరె బాబురావు, గొల్లవిల్లి రాజుబాబు, నాలుగు మండలాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజా క్షేమానికి అలుపెరుగని పోరాటం
స్థానిక సంస్థల ఎన్నికల్లో
విజయమే లక్ష్యం
మాడుగుల వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలు
శోభా హైమావతి
పార్టీ మాడుగుల నియోజకవర్గ
విస్తృత స్థాయి సమావేశం

కలసికట్టుగా కూటమిని కూల్చాలి..