
యోగాతో ఆరోగ్యవంత జీవితం
అనకాపల్లి: మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలంటే నిత్యం యోగా చేయడం అవసరమని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. స్థానిక గవరపాలెం రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం, అంతర్జాతీయ యోగా వేడుకల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక యోగా శిబిరాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నెల రోజుల పాటు నిర్వహించనున్న ‘యోగాంధ్ర–2025‘కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. జిల్లా ఆయుష్ విభాగం అధికారి కె.లావణ్య, యోగా గురువులు శ్రీను, చంద్రిక, శివ, సతీష్, జగన్ తదితరుల మార్గదర్శనంలో అధికారులు, సిబ్బంది యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహనరావు, డీఎస్పీలు బి.మోహనరావు, పి.శ్రీనివాసరావు, వి.విష్ణు స్వరూప్, సీఐలు టి.వి.విజయకుమర్, లక్ష్మణ్ మూర్తి, బెండి వెంకటరావు, బాల సూర్యారావు, టి.లక్ష్మి, గఫూర్, రమేష్, రామకృష్ణ, మన్మథరావు, ఎస్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.