
ప్రతి సచివాలయ పరిధిలో మాక్ డ్రిల్ నిర్వహిస్తాం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కొద్ది రోజుల్లో నగరంలోని అన్ని వార్డు సచివాలయాల పరిధిలో సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తామని కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు. అనుకోని రీతిలో ప్రమాదం వాటిల్లితే ప్రజలు ఎలా స్పందించాలో ముందు నుంచే అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. దానిలో భాగంగానే నగరంలో పలు చోట్ల సాధారణ సివిల్ మాక్ డ్రిల్స్‌తో పాటు బ్లాక్ అవుట్ మాక్ డ్రిల్స్ నిర్వహించినట్లు తెలిపారు. అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లు, ఎమర్జన్సి రెస్పాన్స్ టీమ్‌లు, ఎమర్జన్సి సహాయక వాహనాలు, తాత్కాలిక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, రక్షణ చర్యల్లో వినియోగించే అన్ని రకాల పరికరాలను ప్రదర్శనలో ఉంచామని వివరించారు.