
ప్రతిభకు పురస్కారం
కశింకోట: పదో తరగతిలో 579 అత్యధిక మార్కులు సాధించిన స్థానిక బాలికల హైస్కూల్ విద్యార్థిని ఎం.గౌరి సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉండి చదువుకున్నవారిలో మేటిగా నిలిచింది. రాష్ట్ర స్థాయిలో టాప్ టెన్‌లో 8వ స్థానంలో నిలవడంతో విజయవాడలో ఆమెకు పురస్కారం అందజేశారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో టాప్ టెన్ విద్యార్థులకు అవార్డు మహోత్సవాన్ని నిర్వహించారు. గౌరికి పురస్కారం లభించడం పట్ల హెచ్‌ఎం ఎంఎస్ స్వర్ణకుమారి, స్కూలు నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఆళ్ల శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సిబ్బంది అభినందనలు తెలియజేశారు.