
రేషన్ కార్డుల్లో చేర్పులు మార్పులకు అవకాశం
తుమ్మపాల: రేషన్ కార్డుల్లో చేర్పులు మార్పులకు బుధవారం నుంచి అవకాశం కల్పించినట్టు, అవసరమైన వారు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోడ్ సహిత నూతన రేషన్ కార్డుల మంజూరు చేయడంతోపాటు రేషన్ కార్డుల్లో ఏడు సేవల కోసం ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. నూతన బియ్యం కార్డు జారీ, కుటుంబ సభ్యుని చేర్పు లేదా తొలగింపు, బియ్యం కార్డు సరెండర్, చిరునామా మార్పు, తప్పు ఆధార్ సంఖ్య సరిచేయుట వంటి సేవలు పొందవచ్చునని సూచించారు.