
దాహమో రామచంద్రా..
● అడుగడుగునా రాజకీయం.. దుర్భర ‘జల జీవనం’
● కుళాయి కనెక్షన్ల ఏర్పాటులో రాజకీయ వివక్ష ● ప్రభుత్వం మారాక పలుచోట్ల పడకేసినపైపులైన్ పనులు ● కొన్నిచోట్ల పనులు పూర్తయినా డబ్బులిస్తేనే ఇంటికి కనెక్షన్లు
ఊరూరాదాహం.. దాహం..
సాక్షి, అనకాపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ నీటి కుళాయిల ఏర్పాటే లక్ష్యంగా అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. కూటమి నేతలు తాగునీటిని కూడా రాజకీయం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన పనులను రద్దు చేసి, కూటమి ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వాటికే మళ్లీ కొత్త అనుమతులు ఇస్తున్న పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. ఇలా సుమారు 448 పనులను రద్దు చేశారు. కుళాయి కనెక్షన్ పూర్తయినా, సగం పనులు జరిగి ఆగిపోయినా అలాంటి వాటికి మామూళ్లు ఇస్తేనే కొనసాగిస్తున్నట్లు పలువురు బాధితులు వాపోతున్నారు. జల్ జీవన్ మిషన్ అమలుపై ‘సాక్షి జరిపిన గ్రౌండ్ రిపోర్ట్‌లో అనేక విషయాలు వెలుగు చూశాయి.
పాత పనులకు మంగళం
గత ప్రభుత్వ హయాంలో మంజూరై ప్రారంభం కాని కనెక్షన్లలో దాదాపు సగానికి పైగా రద్దు చేశారు. కొత్తగా కొన్నింటిని చేర్చారు. వాటికి నిధులు ఇంకా మంజూరు కాలేదు. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతంలో ప్రతీ ఇంటికీ కుళాయి ఇవ్వాలనేదే ఈ ప్రాజెక్టు లక్ష్యం. కానీ కూటమి ప్రభుత్వం పరిస్థితి చూస్తే ఆ ఆశయం నెరవేరేలా లేదు. ఈ వేసవిలో కశింకోట, అచ్యుతాపురం, రాంబిల్లి, పరవాడ, యలమంచిలి, నక్కపల్లి మండలం వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
● మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ, కె.కోటపాడు మండలాల్లో 316 గ్రామాల్లో జల్‌జీవన్ మిషన్‌లో రూ.171 కోట్లతో 68,385 కనెక్షన్లు మంజూరయ్యాయి. వీటిలో 44,464 పూర్తయ్యాయి. ఆనందపురం నుంచి కె.కోటపాడు వెళ్లే మార్గంలో ఉన్న ఇళ్లకు మాత్రం నేటికి కుళాయిల ఏర్పాటు లేదు. అసలే వేసవికాలం కావడంతో చేతిబోర్ల వెంట నీరు అంతంత మాత్రంగానే వస్తుందని ఆయా ప్రాంతాల్లో గల మహిళలు తెలిపారు.
● అనకాపల్లి రూరల్ పరిధిలో 3 వేల కనెక్షన్లు మంజూరయ్యాయి. వీటిలో సగానికిపైగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పూర్తయ్యాయి. కొత్త ప్రభుత్వం వచ్చాక కొన్ని పనులను రద్దు చేశారు. కొత్తగా మరికొన్ని మంజూరు చేసినా బిల్లు ఇప్పటి వరకూ రాలేదు.
● నర్సీపట్నం రూరల్, నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం మండల పరిధిలో తాగునీటి సరఫరా అంతంత మాత్రంగా ఉంది. జల్‌జీవన్ మిషన్‌లో భాగంగా సుమారు 40 వేలకు పైగా ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు మంజూరయ్యాయి. వీటిలో 60 శాతానికి పైగా పూర్తయ్యాయి. కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. మరికొన్ని అసలు ప్రారంభం కాలేదు.
● యలమంచిలి నియోజకవర్గంలో సుమారు 20 వేలకు పైగా కుళాయి కనెక్షన్లు మంజూరయ్యాయి. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలు పూర్తిగా పారిశ్రామిక ప్రాంతం కావడంతో 10 వేలకుపైగా కుళాయిలు మంజూరయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో సగానికిపైగా పూర్తయ్యాయి. కానీ పారిశ్రామిక ప్రాంతంలో గత ప్రభుత్వంలో మంజూరైన పనుల్లో కొన్ని రద్దు చేసి మరికొన్ని కొత్తగా చేర్చారు.వీటికి నిధులు మంజూరు కాలేదు. ఈ ప్రాంతమంతా కలుషితం కావడంతో ఈ ప్రాంతంలో వాటర్ సమస్య ఎక్కువగా ఉంది. స్థానికంగా ఈ రెండు మండలాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా వెంటాడుతుంది.
● చోడవరం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో రూ.137 కోట్లతో 69 వేల ఇళ్లకు ఇంటింటికీ కుళాయిలు మంజూరు చేశారు. వీటిలో సుమారు 10 వేల కనెక్షన్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. చోడవరం టౌన్‌లో 5,941 ఇంటింటి కుళాయిలు ఇచ్చారు. కందర్పకాలనీ, అన్నవరం ప్రాంతాల్లో ఇంకా 400 ఇళ్లకు ఇంటింటి కుళాయిలు ఇవ్వాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకూ వాటిని ఏర్పాటు చేయలేదు. దీనితో ఆయా ప్రాంతాల్లో మంచినీటి సమస్య ఉంది. ఏదో అడపాదడపా వీధి కుళాయిల ద్వారా నీరు ఇస్తున్నప్పటికీ ఒక్కొక్క ఇంటికి రెండు బిందెలు నీరు కూడా రావడం లేదు.
పూర్తయినవి–రద్దు చేసినవి
జిల్లాలో జల్ జీవన్ మిషన్ అమలుకు కూటమి నేతల గ్రహణం

దాహమో రామచంద్రా..

దాహమో రామచంద్రా..

దాహమో రామచంద్రా..

దాహమో రామచంద్రా..