
కోట్లాది రూపాయల అవినీతికి భారీ స్కెచ్
దేవరాపల్లి: రాష్ట్రంలో బీసీ మహిళలకు టైలరింగ్ శిక్షణ పేరిట భారీ దోపిడీకి కూటమి ప్రభుత్వం పక్కా స్కెచ్ వేసిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ విమర్శించారు. తారువలో మంగళవారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడారు. బీసీ మహిళలకు ఇచ్చే కుట్టు శిక్షణలో కోట్లాది రూపాయలను కొల్లగొట్టేందుకు ఈ స్కీమ్‌ను వాడుకుంటున్నారని ఆమె ధ్వజమెత్తారు. కుట్టు శిక్షణ పేరిట రూ.257 కోట్లకు టెండర్ పెట్టే విధంగా అనుకూలంగా పథకాన్ని మలుచుకుంటున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా కాంట్రాక్టర్లకు ముందస్తు చెల్లింపులకు సిద్ధం కావడం ఇందుకు నిదర్శనమన్నారు.