
సతకంపట్టు కనకదుర్గమ్మ సన్నిధిలో సినీనటి ఇంద్రజ
అనకాపల్లి: స్థానిక గవరపాలెం సతకంపట్టు కనకదుర్గ అమ్మవారిని సినీ నటి ఇంద్రజ మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు పట్టణానికి వచ్చిన ఆమె కనకదుర్గమ్మను దర్శించి పూజలు చేశారు. ఇంద్రజకు ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆలయ వ్యవస్థాపకుడు పి.వి.రమణ, ఆలయ శాశ్వత చైర్మన్, నిర్వాహకుడు కాండ్రేగుల నాయుడు దంపతులు, ఆలయ అధ్యక్షుడు భీమరశెట్టి వర నూకరాజు, గౌరీ పరమేశ్వరుల ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కొణతాల సంతోష్ అప్పారావునాయుడు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.