
కలెక్టర్ విజయకృష్ణన్
పూడిమడక రోడ్డు విస్తరణ పనులు వేగవంతం
మునగపాక: పూడిమడక రోడ్డు విస్తరణ పనులు వేగవంతం కావాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. మునగపాక కృష్ణంరాజు కాలువపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను ఆమె మంగళవారం స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలం లోగా బ్రిడ్జి పనులు పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారి విస్తరణలో భూములు, గృహాలు కోల్పోయే నిర్వాసితులకు ప్రభుత్వం మెరుగైన పరిహారం అందిస్తుందన్నారు. తహసీల్దార్ ఆదిమహేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.