
జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యం
వైఎస్సార్‌సీపీ జిల్లా నూతన అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. పార్టీ అధినేత తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ఈ సమావేశానికి హాజరైన పార్టీ కేడర్ జోష్ చూస్తుంటే తనలో ఉత్సాహం రెట్టింపయిందన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోమారు సీఎం కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఏడాదికే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైంది.. ఇప్పుడు మన బాధ్యత మరింత పెరిగిందన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ దొర్లకుండా చూసుకుంటామని, కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. గత ఐదేళ్లలో మనం సృష్టించిన వలంటీర్ల వ్యవస్థ ప్రజలకు మేలు చేసింది కానీ వారికి పార్టీని దూరం చేసిందన్నారు. జగనన్న 2.0లో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని, ఈసారి కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన మాటగా మీకు చెప్పమన్నారన్నారు. సింహాచలం దుర్ఘటనలో ఏడుగురు చనిపోవడానికి ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. ఇంటర్నేషనల్ మేస్త్రినంటావు కదా చంద్రబాబూ.. సింహాచలంలో ఏడడుగుల గోడనే నిర్మించలేకపోయావు.. అమరావతిని ఏమి నిర్మిస్తావు అంటూ ఎద్దేవా చేశారు.