
నూకాంబిక అమ్మవారి హుండీ ఆదాయం రూ.34.80 లక్షలు
అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి హుండీల లెక్కింపు సోమవారం జరిగింది. ఏప్రిల్ 16 నుంచి మే 5వ తేదీ వరకు రూ.34,80,099 నగదు, 27,500 మిల్లీగ్రాముల బంగారం, 601 గ్రాముల వెండి కానుకల రూపంలో వచ్చినట్లు ఆలయ హుండీ పర్యవేక్షకుడు టి.సాంబశివరావు చెప్పారు. హుండీ ఆదాయాన్ని గవరపాలెం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జమ చేశామన్నారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్లబాబు), ఈవో వెంపలి రాంబాబు, కమిటీ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు.