
హేచరీ బస్సు, ఆటో ఢీ
కోటవురట్ల: కోటవురట్ల నుంచి ఎస్.రాయవరం మండలం ధర్మవరం వెళుతున్న హెచరీకి సంబంధించిన బస్సును, అడ్డురోడ్డు నుంచి కోటవురట్ల వస్తున్న ఆటో ఢీకొనడంతో 10 మంది గాయపడ్డారు. మండలంలోని పాత రోడ్డు జంక్షన్ దాటాక జరిగిన ఘటనలో క్షతగాత్రులను స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి పి.లక్ష్మి అనే మహిళ ను మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. నర్సీపట్నంలో ఎన్.నూకరత్నం, జి.నాగపద్మ చికిత్స పొందుతుండగా కోటవురట్ల సీహెచ్‌సీలో కె.నాగ తేజ, డి.సోమన్న, కె.వెంకటలక్ష్మి, జి.అమ్మాణి, పి.రాజులమ్మ, ఆర్.శాంతి, వై.శ్రీనులకు ప్రఽథమ చికిత్స అందించారని ఎస్‌ఐ రమేష్ తెలిపారు.
10 మందికి గాయాలు