
శంకరంలో వ్యక్తి ఆత్మహత్య
అనకాపల్లి టౌన్: మండలంలోని శంకరం గ్రామంలో సోమవారం ఒక వ్యక్తి ఉరి వేసుకొని మృతి చెందాడని రూరల్ ఎస్‌ఐ జె.నాగేశ్వరావు తెలిపారు. గ్రామంలో ఒక వ్యక్తికి చెందిన మూసి ఉన్న కోళ్ల ఫారం వద్ద చింతచెట్టుకు ఉరివేసుకొని ఉండగా సమీపంలోని పిల్లలు గమనించి గ్రామ పెద్దలకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. మృతుని ఫ్యాంట్ జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా త్రిపుర రాష్ట్రానికి చెందిన జితిన్ ముండా(39)గా గుర్తించామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.