
బైకును ఢీకొన్న లారీ...ఒకరికి గాయాలు
అచ్యుతాపురం రూరల్: రామన్నపాలెం గ్రామానికి చెందిన ధర్మిరెడ్డి శ్రీనివాసరావును లారీ ఢీకొనడంతో తీవ్ర రక్త స్రావమై అపస్మారక స్థితిలో ఉన్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం క్షతగాత్రుడు శ్రీనివాస్ ఎలక్ట్రీషియన్‌గా విధులు నిర్వర్తించుకుని అచ్యుతాపురం కూడలి నుంచి రామన్నపాలెం తన ఇంటికి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి గుర్తు తెలియని లారీ ఢీకొనడంతో రోడ్డుపై పడి ముక్కు, నోటి నుండి తీవ్రంగా రక్త స్రావమైంది. లారీ క్షతగాత్రుని ఢీకొని ఆపకుండా వెళ్లిపోవడం గమనించిన స్థానికులు లారీని వెంబడించి పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు. రోడ్డుపై పడి తలకు బలంగా గాయం కావడంతో విశాఖలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.