
‘సీహెచ్‌వోల సమస్యలు పరిష్కరించాలి’
అనకాపల్లి టౌన్: కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (సిహెచ్‌ఓ)ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ వి.వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పట్ణణంలోని నెహ్రుచౌక్ స్టేట్‌బ్యాంక్ కార్యాలయం ఎదుట 8వ రోజు సమ్మెలో భాగంగా సిహెచ్‌ఓలు మెకాళ్లపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసనలో పలువురు సీహెచ్‌ఓలు పాల్గొన్నారు.