
బొలేరో, ఆటో ఢీ..ఐదుగురికి గాయాలు
● గన్నవరం మెట్ట వద్ద ప్రమాదం ● తీవ్రంగా గాయపడిన ముగ్గురు వైజాగ్ తరలింపు
నాతవరం: నర్సీపట్నం తుని మధ్య గన్నవరం మెట్ట వద్ద బొలోరో, ఆటో ఢీకొన్న సంఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఎస్‌ఐ సిహెచ్.భీమరాజు అందించిన వివరాలివి. నాతవరం మండలం ఎంబీపట్నం గ్రామానికి చెందిన వారు కాకినాడ జిల్లాలో వివాహం సంబంధించి పెద్దలు భోజనానికి ఆటోపై వెళ్లారు. అక్కడ భోజనాలు అనంతరం తిరిగి ఆటోపై ఇంటికి వస్తుండగా నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్దకు వచ్చేసరికి నర్సీపట్నం నుంచి తుని వైపు వళ్తున్న బొలేరో వ్యాను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఎంబీపట్నం గ్రామానికి చెందిన సలగాల సంతోష్, ఆడ్డాల కృపానందం, పెద్దాడ మరిడియ్య, కోరుబిల్లి దుర్గ, కె.చినరాజుబాబు గాయపడ్డారు. వీరిని వెంటనే వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో సలగాన వసంతకు కుడి కాలికి, కృపానందం ముఖంపైనా, మరిడియ్యకు ఎడమ చేతికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించారు. నాతవరం పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి నర్సీపట్నం తుని అర్‌అండ్‌బీ రోడ్‌డుౖపై ట్రాఫిక్‌ను చక్కదిద్దారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ భీమరాజు తెలిపారు.

బొలేరో, ఆటో ఢీ..ఐదుగురికి గాయాలు