
మా భూమిలోకి మమ్మల్ని రానివ్వడం లేదు...
యువతిపై లైంగికదాడి..!
కేసు నమోదులో పోలీసుల తాత్సారం..
ఎస్.రాయవరం మండలం దార్లపూడి గ్రామానికి చెందిన చుక్కా నాగమణి మాట్లాడుతూ తన స్వగృహంలో గత నెల 29న రాత్రి ఇంటిలో నిద్రిస్తుండగా తన ఇంట్లోకి అదే గ్రామానికి చెందిన పప్పల మణికంఠ చొరబడి తన కూతురు ధనలక్ష్మిపై లైంగికదాడికి పాల్పడ్డాడని తెలిపింది. ఈ విషయం తల్లిదండ్రులకు గానీ, ఇంకేవరికై నా చెపితే చంపేస్తానని బెదిరించాడని కూతురు తెలిపిందని, తాను, భర్త మేడపై నిద్రిస్తుండగా కింద గదిలో పడుకున్న తన కూతురు సుమారు 2 గంటల సమయంలో కేకలు వేయడంతో వెంటనే వెళ్లి అతనిని బంధించి సమీప ప్రజలను పిలిచి పంచాయతీ నిర్వహించి పెళ్లి చేసుకోమని కోరగా అందుకు నిరాకరించాడని తెలిపింది. వెంటనే 30వ తేదీన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, అయితే స్టేషన్ అధికారులు ఫిర్యాదు తీసుకోవడానికి తాత్సారం చేస్తున్నారని తెలిపారు. హోంమంత్రి అనిత పీఏ ప్రోద్బలంతోనే ఫిర్యాదు స్వీకరించడంలేదని ఆమె ఆరోపించింది. రెల్లి కులస్ధులమయినందున తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, స్ధానికంగా న్యాయం జరగకపోవడంతో ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నట్టు ఆమె తెలిపింది.
కశింకోటకు చెందిన కాశిందేవుల నానాజీ మాట్లాడుతూ మాకు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పాయకరావుపేట మండలం ఈదటం గ్రామంలో 2.5 ఎకరాలు భూమి అన్ని రికార్డులతో కలిగి ఉన్నామని తెలిపారు. ఆ భూమిలోకి వస్తుంటే భూమికి సంబంధం లేని తమ బంధువులు అడ్డుకుంటున్నారని తెలిపారు. ఇదే విషయంపై 2019 నుంచి స్పందనలో ఫిర్యాదు చేస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. అధికారులు మారినప్పుడల్లా బంధువులు భూమిలోకి వస్తూ ఇబ్బంది పెడుతున్నారన్నారు. తమకు న్యాయం చేయాలన్నారు.