
పవర్ లిఫ్టింగ్ పోటీల్లో నాగజ్యోతి ప్రతిభ
రావికమతం: కొత్తకోటకు చెందిన ఉపాధ్యాయిని పి.ఎం.ఎన్.నాగజ్యోతి పాన్ ఇండియా మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి నాలుగు విభాగాల్లో బంగారు పతకాలు సాధించింది. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులంలో 4వ నేషనల్ పాన్ ఇండియా మాస్టర్స్ పవర్ లిప్టింగ్ ఛాంపియన్ షిప్ –2025 పోటీలు ఈ నెల 3,4 తేదీలలో జరిగాయి. నాగజ్యోతి మహిళల విభాగంలో బెంచ్‌సై, స్క్వాట్, డెడ్ లిఫ్ట్ విభాగాలు మూడింట్లోనూ, ఓవరాల్ ఛాంపియన్ షిప్‌లోను కలిపి నాలుగు విభాగాల్లో బంగారు పతకాలు సాధించారు. ఛాంపియన్‌షిప్ నిర్వాహక కమిటీ ప్రెసిడెంట్ దీపుదేవ్, మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్ వి.ఎన్.షాజీ చేతుల మీదుగా నాగజ్యోతి అందుకున్నారు. కొత్తకోట గ్రామానికి చెందిన నాగజ్యోతి ప్రస్తుతం రోలుగుంట హైస్కూల్లో ఆంగ్ల ఉపాధ్యాయినిగా విధులు నిర్వహిస్తున్నారు. నాలుగు బంగారు పతకాలు సాధించిన నాగజ్యోతి ని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, వాసవీ వనితా క్లబ్ సంఘం మహిళలు, గ్రామస్తులు అభినందించారు.