
మున్సిపల్ కార్మికుల సమ్మె నోటీసు
యలమంచిలి రూరల్: ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా యలమంచిలి పురపాలక సంఘం పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేయనున్నట్టు తెలియజేస్తూ మున్సిపల్ కమిషనర్ బీజేఎస్ ప్రసాదరాజుకు మున్సిపల్ కార్మికులు సమ్మె నోటీసు సోమవారం అందజేశారు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులను ఉద్యోగాల్లో పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం నెలకు రూ.26వేలు చేయాలని,కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలన్న పలు డిమాండ్లతో సమ్మెకు దిగుతున్నట్టు నోటీసులో పేర్కొన్నారు.కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యుడు గనిశెట్టి ఏసుదాసు,మున్సిపల్ వర్కర్ల సంఘం నాయకులు వై.నూకరాజు, సీహెచ్.వెంకటరమణ, సూరిబాబు పాల్గొన్నారు.