
నేడు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా అమర్‌నాథ్ ప్
అనకాపల్లి: స్థానిక రింగ్‌రోడ్డు పెంటకోట కన్వెన్షన్ హాల్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా గుడివాడ అమర్‌నాథ్ ప్రమాణస్వీకారం చేయనున్నారని, అనంతరం పార్టీ శ్రేణులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారని ఆపార్టీ మండల అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, వైఎస్సార్‌సీపీ అడ్వైజర్ కమిటీ మెంబర్, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జ్ కరణం ధర్మశ్రీ, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలు శోభ హైమావతి, నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ పాల్గోనున్నట్టు తెలిపారు. జిల్లాలో వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరుకానున్నట్టు ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని వారు కోరారు.