
బాధిత రైతుకు రూ.5 వేల సాయం
చీడికాడ: రైతుల పక్షపాతి మాజీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అని మండల వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, ఎంపీపీ కురచా జయమ్మనారాయణమూర్తి అన్నారు. పిడుగుపడి గేదె, పెయ్యిని కోల్పోయి నష్టపోయిన మండలంలోని చినగోగాడకు చెందిన రైతు కోనేటి సత్తబాబుకు మాజీ డిప్యూటి సీఎం బూడి ముత్యాలనాయుడు ఆదేశాల మేరకు ఆదివారం మధ్యాహ్నం పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.5వేల నగదును తమ వంతు సహకారంగా అందించారు. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ సీఎంగా ఉన్న రోజుల్లో రాష్ట్రంలో రైతు రాజుగా మెలిగాడని, నేడు అప్పులపాలై దిక్కుతోచని స్థితిలో పాడ్డాడన్నారు. వారి వెంట వైస్ ఎంపీపీ ధర్మిశెట్టి స్వాతి కొండబాబు, నేతలు పుట్టా రామ్‌కుమార్, కొల్లి శ్రీనివాసరావు, ఎంపిటిసి కొల్లి నారాయణమూర్తి, ప్రగడసాయి, కోన సత్తిబాబు, రామారావు తదితరులున్నారు.