
కోనాం భోగొండమ్మను దర్శించుకున్న ధర్మశ్రీ , రేగం
చీడికాడ: మండలంలోని కోనాం భోగొండమ్మను అరుకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. భోగొండమ్మ పండగ మహోత్సవంలో భాగంగా ఆయన కోనాంలో గల బంధువుల ఇంటికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే అనకాపల్లి వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ ఇన్‌చార్జి కరణం ధర్మశ్రీ, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్ల భాగ్యలక్ష్మిలతో పాటు, వైఎస్‌స్రా్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి, సీడీసీ చైర్మన్ సుంకర శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటీసీ సలుగు సత్యనారాయణ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.