
వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి తరలిరా
దేవరాపల్లి: అనకాపల్లిలో సోమవారం జరిగే వైఎస్సార్‌సీపీ జిల్లా విస్త్రృత స్థాయి సమావేశానికి నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు తరలిరావాలని మాజీ డిప్యూటీ సీఎం, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల సలహా సంఘం సభ్యుడు బూడి ముత్యాలనాయుడు ఆదివారం పిలుపునిచ్చారు. అనకాపల్లి రింగ్‌రోడ్డులోని బెల్లం మార్కెట్ ఎదురుగా ఉన్న పెంటకోట కన్వెన్షన్ హాల్‌లో సోమవారం ఉదయం పది గంటల ఈ సమావేశం ప్రారంభమవుతుందన్నారు. పార్టీ ముఖ్య నాయుకులు హాజరయ్యే ఈ సమావేశానికి అన్ని గ్రామాల నుంచి పార్టీ నాయుకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు.