
అమ్మ హెల్పింగ్ హార్ట్స్‌కు పురస్కారం
బుచ్చెయ్యపేట : వడ్డాదికి చెందిన అమ్మ హెల్పింగ్ హార్ట్స్ సేవా సంస్థకు యంగ్ ఇండియన్ సేవా పురస్కారం అవార్డు లభించింది. వడ్డాదికి చెందిన అమ్మ హెల్పింగ్ హార్ట్స్ గత 16 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంత ప్రజలకు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయమే కాక ఆపదలో ఉన్న వేలాది మందికి రక్తదానం చేసి వారి ప్రాణాలను కాపాడుతున్నారు. ఇప్పటి వరకు పలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వేలాది యూనిట్లు రక్తాన్ని సేకరించారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతను చైతన్య పరుస్తూ,యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగేలా పలు సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్న అమ్మ హెల్పింగ్ హార్ట్స్ సంస్థ సేవలకు గాను తెలంగాణ ప్రాంతానికి చెందిన భద్రాది యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వారు ఈ అవార్డును ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డి చేతుల మీదుగా యంగ్ ఇండియన్ బ్లడ్ ఓనర్స్ క్లబ్ సభ్యులు అమ్మ హెల్పింగ్ హార్ట్స్ సభ్యులకు ఈ అవార్డును అందించారు.