
కూటమి పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యం
చోడవరం: కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదని, ఆ పార్టీ నాయకులు దందాలు చేసుకోవడానికే అధికారం పనికొచ్చిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, చోడవరం సమన్వయకర్త గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.పార్టీ స్థానిక కా ర్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో ఒక్కటీ అమలు చేయలేదని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అనకాపల్లి వయా చోడవరం, నర్సీపట్నం రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరుచేసినప్పటికీ అప్పటి కాంట్రాక్టర్ టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో పనులు పూర్తిస్థాయిలో చేయలేదని చెప్పారు. ఎన్నికల్లో ఇదే రోడ్డును అస్త్రంగా వాడుకొని గెలిచిన ఆపార్టీ నాయకులు ఇప్పుడు ఎందుకు ఈ రోడ్డు బాగుచేయడానికి చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు.రోలుగుంట మండలంలో క్వారీల వద్ద టీడీపీ నాయకులు దందాలకు పాల్పడుతున్నారని, టన్నుకి రూ.200 చొప్పు న అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈనెల 5వతేదీన నిర్వహించనున్న వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలపై చర్చించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీనిమరింత బలోపేతం చేసే దిశగా చర్చించడంతోపాటు కూటమి ప్రభుత్వం పాల్పడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేసేందుకు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఈసమావేశంలో పార్టీ జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, రైతు విభాగం అధ్యక్షుడు బొడ్డేడ సూర్యనారాయణ, ఎంపీపీలు గాడి కాసు, శ్రీనివాసరావు వైస్ ఎంపీపీలు దొండా నారాయణ మూర్తి, శరగడం నాగేశ్వరరావు, డీఆర్‌యూసీ సభ్యు డు బొడ్డు శ్రీరామ్మూర్తి, పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రావు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాఽథ్