
నూకాంబిక సేవలోప్రిన్సిపల్ సెక్రటరీ
అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు స్థానిక గవర పాలెం నూకాంబిక అమ్మవారిని రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజ లు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ ఈ ఏడాది అమ్మవారి జాతరను రాష్ట్ర పండగగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. నెల రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం దేవదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శోభారాణి ప్రిన్సిపల్ సెక్రటరీని శాలువాతో సత్కరించి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వెంపలి రాంబాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగ శ్రీను(గొల్లబాబు), ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.