ప్రాణాలను బలిగొందా... | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలను బలిగొందా...

May 2 2025 1:09 AM | Updated on May 2 2025 1:09 AM

ప్రాణ

ప్రాణాలను బలిగొందా...

మెట్ల నిర్మాణ ప్రణాళిక మార్పే
● పాత పద్ధతిలోనే మెట్లమార్గం నిర్మిస్తే ప్రమాదం జరిగేది కాదు ● అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం

విషాదంతో ఉలిక్కిపడ్డ

వ్యాపారులు

కొత్తగా నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించి నాలుగు రోజులు కూడా గడవకముందే, తమ ప్రాంగణంలో ఇంతటి ఘోర విషాదం చోటుచేసుకోవడంతో సింహగిరి వ్యాపారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పాదాలమ్మ–బంగారమ్మ ఆలయాల ప్రాంగణంలో తాత్కాలిక దుకాణాల్లో వ్యాపారం చేసుకుంటున్న వర్తకులను, చందనోత్సవానికి కేవలం నాలుగు రోజుల ముందు హడావుడిగా, ఇంకా పూర్తిగా సిద్ధం కాని కొత్త షాపింగ్‌ కాంప్లెక్స్‌లోకి తరలించారు. చందనోత్సవ సమయంలో వాహనాల పార్కింగ్‌ కోసం స్థలం అవసరమని చెప్పడంతో వ్యాపారులు అయిష్టంగానే కొత్త షాపింగ్‌ కాంప్లెక్స్‌లోకి మారారు. తరలి వెళ్లిన కొద్ది రోజులకే తమ షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్దే ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారని తెలిసి ఆందోళన చెందారు. సింహగిరి చరిత్రలో ఎన్నడూ ఇలాంటి దుర్ఘటన జరగలేదని, అయ్యో పాపం భక్తులంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు.

సింహాచలం: సింహాచలం కొండపై షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద నుంచి జోడు భద్రాల ప్రాంగణానికి వెళ్లేందుకు నిర్మించిన కొత్త మెట్లమార్గం రూపకల్పనలో చేసిన మార్పులే ఏడుగురు భక్తుల ప్రాణాలను బలిగొన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో అనేక చందనోత్సవాల సమయంలో అదే స్థలంలో ఉన్న పాత మెట్లమార్గంలో తీవ్రమైన తోపులాటలు, అధిక రద్దీ నెలకొన్నప్పటికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, దురదృష్టవశాత్తు చరిత్రలో మొదటిసారిగా అదే ప్రదేశంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. వివరాల్లోకి వెళితే, సింహగిరిపై ఉన్న బస్టాండ్‌ నుంచి ఆలయానికి చేరుకోవడానికి ఉన్న మెట్లమార్గం ఇరువైపులా రెండు బ్లాక్‌లలో వ్యాపారుల షాపింగ్‌ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. గతంలో ఈ మెట్లమార్గం నేరుగా జోడు భద్రాల ప్రాంగణానికి చేరుకునేది. చందనోత్సవం రోజుల్లో భక్తులను ఈ మార్గంలోనే వరుస క్రమంలో పంపి నేరుగా జోడు భద్రాల ప్రాంగణానికి వెళ్లేలా ఏర్పాట్లు చేసేవారు. ప్రసాద్‌ స్కీమ్‌ కింద పాత షాపింగ్‌ కాంప్లెక్స్‌ను తొలగించి, కొత్త దుకాణాలను రెండు బ్లాక్‌లుగా పాత పద్ధతిలోనే నిర్మించారు.అయితే, ఈ రెండు బ్లాక్‌ల మధ్య నిర్మించిన కొత్త మెట్లమార్గం విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహించారు. పాత ప్రణాళికలను అనుసరించకుండా, జోడు భద్రాల వద్దకు చేరుకునే మెట్లను కుడి, ఎడమ వైపులకు మళ్లించారు. మధ్యలో దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తులో నాసిరకమైన గోడను నిర్మించడంతో, ఎడమ వైపు నుంచి రూ.300 క్యూలో వెళ్తున్న భక్తులపై అది ఒక్కసారిగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

వైదిక వర్గాలు చెబుతున్నా లెక్కచేయకుండా...

ఏటా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి కొండ దిగువన నాలుగు పర్యాయాలు ఉత్సవాలు జరుగుతాయి. ఆ సందర్భాలలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను కొండపై నుంచి పల్లకిలో దిగువకు తీసుకువస్తారు. గతంలో జోడు భద్రాల నుంచి నేరుగా ఉన్న మెట్లమార్గం ద్వారానే ఊరేగింపు జరిగేది. కొత్త షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం తర్వాత కూడా అదే విధంగా నిర్మించాలని పలువురు వైదిక పండితులు సూచించినప్పటికీ, అధికారులు వారి మాటలను పట్టించుకోలేదని తెలుస్తోంది. వారి నిర్లక్ష్య వైఖరి ఇప్పుడు ఏడుగురు భక్తుల ప్రాణాలను బలిగొన్న విషాదానికి దారితీసింది.

ప్రాణాలను బలిగొందా...1
1/2

ప్రాణాలను బలిగొందా...

ప్రాణాలను బలిగొందా...2
2/2

ప్రాణాలను బలిగొందా...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement