
పలు రైళ్లకు అదనపు కోచ్‌లు
తాటిచెట్లపాలెం:వేసవి రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రస్తుతం నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లకు అదనపు కోచ్‌లు జతచేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
● విశాఖలో ఈ నెల 4, 11, 18, 25 తేదీల్లో బయల్దేరే విశాఖపట్నం–ఎస్‌ఎంవీ బెంగళూరు(08581) స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు, తిరుగు ప్రయాణంలో బెంగళూరులో ఈ నెల 5, 12, 19, 26 తేదీల్లో బయల్దేరే ఎస్‌ఎంవీ బెంగళూరు–విశాఖపట్నం(08582) స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు 1–థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌ను జతచేస్తున్నారు.
● విశాఖలో ఈ నెల 6, 13, 20, 27 తేదీల్లో బయల్దేరే విశాఖపట్నం–కర్నూలు సిటీ(08545) స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు, తిరుగు ప్రయాణంలో కర్నూలు సిటీలో ఈ నెల 7, 14, 21, 28 తేదీల్లో బయల్దేరే కర్నూలు సిటీ–విశాఖపట్నం(08546) స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు 1–థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌ను కలుపుతున్నారు.
● విశాఖలో ఈ నెల 2, 9, 16, 23, 30 తేదీల్లో బయల్దేరే విశాఖపట్నం–చర్లపల్లి(08579) స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు, తిరుగు ప్రయాణంలో చర్లపల్లిలో ఈ నెల 3, 10, 17, 24, 31 తేదీల్లో బయల్దేరే చర్లపల్లి–విశాఖపట్నం(08580) స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు 1–థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌ను జతచేస్తున్నారు.