
పాలిసెట్‌కు 94 శాతం మంది హాజరు
తుమ్మపాల/అనకాపల్లి టౌన్/నర్సీపట్నం: జిల్లావ్యాప్తంగా బుధవారం నిర్వహించిన పాలిసెట్‌కు 94 శాతం మంది విద్యార్థులు హాజరై పరీక్షలు రాశారని జిల్లా కో–ఆర్డినేటర్ ఐవీఎస్‌ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 9,049 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో బాలురు 4,974, బాలికలు 3,538 మంది హాజరయ్యారన్నారు. జిల్లావ్యాప్తంగా 23 కేంద్రాల్లో పాలిసెట్ పరీక్ష జరిగింది. అనకాపల్లిలో 14, నర్సీపట్నంలో 9 కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం తాగునీరు, ప్రథమ చికిత్స కిట్‌లను అందుబాటులో ఉంచారు. నర్సీపట్నంలో 2,460 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షలకు 2,296 మంది హాజరయ్యారని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పరీక్ష నిర్వాహకుడు నర్సింహులు తెలిపారు.

పాలిసెట్‌కు 94 శాతం మంది హాజరు