
ఆయుష్మాన్ సీహెచ్‌వోల ధర్నా
కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న ఆయుష్మాన్
ఆరోగ్య మందిర్ సీహెచ్‌వోలు
తుమ్మపాల : అనేక సమస్యలతో సతమతమవుతున్న తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వం స్పందించాలంటు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల సీహెచ్‌వోలు కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సమస్యల పరిష్కారంపై డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రతతో పాటు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ చేయాలన్నారు. ప్రతి ఏటా 5 శాతం ఇంక్రిమెంట్, పని ఆధారిత ప్రోత్సాహకాలు క్రమబద్దీకరణ, ఈపీఎఫ్‌వో పునరుద్ధరణ, ఎఫ్‌ఆర్‌ఎస్ నుంచి సీహెచ్‌వోలను మినహాయించాలన్నారు.హెచ్‌ఆర్ పాలసీ వెంటనే అమలు చేయాలన్నారు. రెండేళ్ల నుంచి ఉన్న జీతభత్యాల సమస్యలు పరిష్కరించాలని కోరారు.