
నేటి పాలిసెట్‌కు సర్వం సిద్ధం
తుమ్మపాల: ఈ నెల 30న జిల్లాలో పాలిసెట్ పరీక్ష–2025 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కో–ఆర్డినేటర్ ఐ.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. జిల్లాలో 23 కేంద్రాల్లో నిర్వహించనున్న పరీక్షకు మొత్తం 9,022 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రం అనకాపల్లి టౌన్‌లో 14, నర్సీపట్నంలో 9 కేంద్రాలలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉదయం 10 గంటలకు మొదలయ్యే పరీక్షకు అభ్యర్థులు హాల్‌టిక్కెట్‌తో గంట ముందు చేరుకోవాలన్నారు. బాల్ పాయింట్ పెన్ (బ్లాక్), పెన్సిల్, ఎరేజర్, షార్పనర్ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు (ట్యాబ్స్, మొబైల్ ఫోన్లు) కాలిక్యులేటర్లు, స్మార్ట్ వాచ్‌లకు అనుమతి లేదన్నారు.