
డీఈవోకు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ సత్కారం
జిల్లా విద్యాశాఖాధికారి అప్పారావు నాయుడును సత్కరిస్తున్న నోబుల్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు
అనకాపల్లి టౌన్ : జిల్లా పరిధిలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ, ఉత్తమ ఫలితాల సాధనకు విశేష కృషి చేసిన జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడును నోబుల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం సత్కరించారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ త్వరితగతిన 10వ తరగతి సిల్‌బస్ పూర్తి చేయించడంలోనూ, నిర్వహించడంలోనూ ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణంరాజు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి తుంపాల వెంకటరమణ, నక్కా శ్రీనుబాబు పాల్గొన్నారు.