
గుండె గు‘బిల్లు’
● కొనసాగుతున్న కరెంటు బిల్లుల దందా ● కూటమి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం
నక్కపల్లి: ఎస్సీ, ఎస్టీలకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ రాయితీని తుంగలోకి తొక్కడమే కాక వేలాది రూపాయల బకాయిలు కూడా చెల్లించమని కూటమి సర్కారు ఒత్తిడి చేయడం పట్ల తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తమవుతోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు నెలకు 200 యూనిట్ల వరకు మినహాయింపు ఇచ్చి ఉచితంగా విద్యుత్ అందించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు వేలల్లో కరెంటు బిల్లులు వస్తున్నాయి. తామూ ఉచిత కరెంటు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు 200 యూనిట్ల రాయితీని అమలు చేయకపోవడమే కాక పాత బకాయిలు ఉన్నాయంటూ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. డొంకాడలో ఏప్రిల్ నెలలో 100 యూనిట్లు లోపు విద్యుత్ వినియోగించిన దళితులకు ట్రాన్స్‌కో వారు ఇచ్చిన బిల్లులు షాక్ కొట్టాయి. మే నెలలో చెల్లించాలని, కాని పక్షంలో కనెక్షన్ తొలగిస్తామంటూ బెదిరిస్తున్నారని దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, మండల కన్వీనర్ ఎం.రాజేష్‌లు డొంకాడ దళిత కాలనీకి వెళ్లి బిల్లులు పరిశీలించారు. సర్వీసు నెంబరు 478లో నిమ్మల బాలయ్య 145 యూనిట్లు వాడితే రూ.9,324 బిల్లు ఇచ్చారు. సర్వీసు నెంబరు 196తో డి.పెద అప్పారావు 66 యూనిట్లు వాడితే రూ.1571లు చెల్లించాలని బిల్లు వచ్చింది. సర్వీసు నెంబరు 617తో రాములమ్మ 75 యూనిట్లు వాడితే రూ.1086లు చెల్లించాలని బిల్లు చేతికిచ్చారు. ఈ బిల్లులపై అప్పలరాజుతోపాటు వినియోగదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఒక్క పైసా కూడా కరెంటు బిల్లులు కట్టలేదన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీలపై బకాయిల భారం మోపకుండా చూడాలని, 200 యూనిట్ల వరకు ఉచిత పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అప్పారావు వాడిన 66 యూనిట్లకు వచ్చిన బిల్లు

గుండె గు‘బిల్లు’

గుండె గు‘బిల్లు’