
లేటరైట్ పేరుతో బాకై ్సట్ దోపిడీ
నర్సీపట్నం : నాతవరం మండలం, సుందరకోట ప్రాంతంలో లేటరైట్ పేరుతో బాకై ్సట్ దోపిడీకి పాల్పడుతున్నారని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బొట్టా నాగరాజు పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి తవ్వకాలు ప్రారంభించారన్నారు. లేటరైట్ తవ్వకాల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు ఆడవినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారన్నారు. అక్రమ మైనింగ్ వల్ల వారి జీవన మనుగడకే ప్రమాదం ఉందన్నారు. కొంత మంది దళారులు, రాజకీయ నాయకులు సహాయంతో అక్రమ మైనింగ్ జరుగుతుందన్నారు. గతంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు లేటరైట్ ముసుగులో బాకై ్సట్ తవ్వుకుపోతున్నారని ఆందోళన చేశారని గుర్తు చేశారు. గతంలో బాకై ్సట్ అయినప్పుడు ఇప్పుడు లేటరైట్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. తక్షణమే అక్రమ మైనింగ్‌ను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.