
సారాబట్టీలపై ఎకై ్సజ్ పోలీసుల దాడులు
కె.కోటపాడు : కొత్తభూమి గ్రామంలో సారా తయారీ కేంద్రాలపై చోడవరం ఎకై ్సజ్ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. చోడవరం ఎకై ్సజ్ సీఐ పాపునాయుడు ఆదేశాల మేరకు సిబ్బందితో కలిసి ఎస్‌ఐ శేఖరం గ్రామం శివార్లలో తనిఖీలు జరిపారు. గ్రామ శివార్లలో గల సరుగుడు తోటలో డ్రమ్ములతో సారా తయారీకి సిద్ధంగా ఉన్న 600 లీటర్ల బెల్లం పులుపును గుర్తించి ధ్వంసం చేశారు. వీటితో పాటు 30 లీటర్ల సారాతో పాటు దమ్ము దేముడు అనే వ్యక్తిని పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపినట్టు ఎస్‌ఐ తెలిపారు. సారా కేసుల్లో ఒకటి కంటే ఎక్కువమార్లు పట్టుబడితే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు దాడుల్లో ఎకై ్సజ్ సిబ్బంది రాంబాబు, కె.వి.నాయుడు పాల్గొన్నారు.