
రేపే అప్పన్న చందనోత్సవం
ఏర్పాట్లు ఇలా...
● అడవివరం సమీపంలోని రెండో ఘాట్‌రోడ్డు నుంచే బస్సులు సింహగిరికి వెళ్లేలా.. తొలి ఘాట్‌రోడ్డులో బస్సులు కిందకు దిగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
● 30వ తేదీ తెల్లవారుజాము 3 గంటల నుంచి పాత గోశాల జంక్షన్, పాత అడవివరం జంక్షన్‌ల నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన బస్సుల్లో మాత్రమే సింహగిరిపైకి భక్తులను అనుమతిస్తారు. దేవస్థానం అద్దె చెల్లించిన 51 ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా భక్తులకు రవాణా సదుపాయం ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనం, రూ.300 టికెట్ల వారికి ఆర్టీసీ బస్సులు, రూ.1000, రూ.1500 టికెట్ల వారికి మినీ బస్సులు సిద్ధం చేశారు.
● తొలిసారిగా ఉచిత లడ్డూ ప్రసాదం అందిస్తున్నారు. ఈమేరకు 1.7 లక్షల చిన్న లడ్డూలను సిద్ధం చేస్తున్నారు.
● కొండదిగువ పాత గోశాల జంక్షన్, పాత అడవివరం జంక్షన్, శ్రీనివాసనగర్‌లో లడ్డూ ప్రసాదం విక్రయిస్తారు. ఈ మేరకు 60 వేల లడ్డూలను సిద్ధం చేశారు.
● దివ్యాంగులకు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక దర్శన సమయం కేటాయించారు. దివ్యాంగుడితో ఒకరిని సహాయకుడిగా అనుమతిస్తారు.
● ఒకేసారి 25,300 మంది భక్తులు వేచి ఉండేలా సింహగిరిపై 37,950 వేల రన్నింగ్ ఫీట్ మేర దర్శనాల క్యూలను రూపొందించారు.
● ప్రస్తుతం ఉన్న 106 పర్మినెంట్ మరుగుదొడ్లతో పాటు అదనంగా 133 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.
● స్వచ్ఛంద సంస్థలు తాగునీరు, మజ్జిగ, శీతల పానీయాలు, అల్పాహారాలు, స్నాక్స్ అందించనున్నాయి.
● దర్శనాంతరం సింహగిరిపై అన్నదాన భవనం వద్ద 60 వేల మందికి దద్దోజనం, కదంబం అన్నప్రసాదంగా అందించనున్నారు.
● కేశఖండనశాలకు కేవలం సింహగిరిపై లోవతోటప్రాంతం నుంచి మాత్రమే వెళ్లేలా ఏర్పాటు చేశారు.
● కొండపైన 8, కొండ దిగువన 7 వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 29, 30 తేదీల్లో 513 మంది వైద్య సిబ్బంది నాలుగు షిఫ్టుల్లో పనిచేస్తారు. 32 అంబులెన్సులు, 10 స్ట్రెచర్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లు, వైద్యులు అందుబాటులో ఉంటారు.
● సీపీ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో 2 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
● రాత్రి 9 గంటల నుంచి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. ఇందుకోసం ఉత్తర, దక్షిణ రాజగోపురాల వద్ద ప్రత్యేకంగా బ్రిడ్జిలు ఏర్పాటుచేశారు.
● నిఘా కోసం 206 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు.
● చందనోత్సవంకి సంబంధించిన సమాచారం 0891–275666 నెంబర్‌లో తెలుసుకోవచ్చు.
● డ్యూటీ పాస్ ఉన్న వెహికల్స్‌ని మాత్రమే పరిమితంగా సింహగిరిపైకి అమమతిస్తారు.

రేపే అప్పన్న చందనోత్సవం

రేపే అప్పన్న చందనోత్సవం