
వెల్లువెత్తిన అర్జీలు.. హోరెత్తిన నిరసనలు
కనికరించని అధికారులు
పింఛన్ పునరుద్ధరణకు మూడు నెలలుగా జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు చుట్టూ తిరుగుతున్నా కనికరించటం లేదని రోలుగుంట మండలం, కొరుప్రోలు గ్రామానికి చెందిన గిరిజన వికలాంగుడు గెమ్మిలి ఆనంద్ వాపోయాడు. మరోసారి కలెక్టర్‌కు విన్నవించుకునేందుకు భార్య, పిల్లలతో సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చానని తెలిపాడు. గ్రామానికి రోడ్డు వేయాలని గ్రామస్తులతో కలిసి డోలీతో నిరసన తెలిపినందుకు పింఛన్ నిలిపివేశారని, పింఛన్ ఆధారంగా నలుగురు పిల్లలను పోషించుకుంటూ జీవిస్తున్న తనకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను వేడుకున్నానని బాధితుడు తెలిపారు.
గెమ్మిలి ఆనంద్
లేటరైట్ తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కలెక్టర్ విజయ కృష్ణన్‌ను కోరారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో నాతవరం మండలం, సుందరకోటలో జరుగుతున్న లేటరైట్ తవ్వకాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాలుగు రోజులుగా సాగుతున్న తవ్వకాలు కోర్టు అనుమతుల మేరకు జరుగుతున్నాయా.. లేక ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందా అన్న దానిపై స్పష్టత ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. లేటరైట్ ముసుగులో రూ.15 వేల కోట్ల విలువైన బాకై ్సట్ దోపిడీ జరుగుతుందని సీఎం చంద్రబాబునాయుడు గతంలో ఆరోపించారన్నారు. లేటరైట్ కాదు బాకై ్సట్ అన్నప్పుడు అనుమతులు ఎలా ఇచ్చారని గణేష్ ప్రశ్నించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు అనుమతులు వస్తే నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న తవ్వకాలపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సుందరకోట బమిడకలొద్దు నుంచి మైనింగ్ లారీలతో వెళ్లాలంటే వేంబ్రిడ్జి ఉండాలన్నారు. వేయింగ్ తర్వాతే లారీలు బయటకు వెళ్లాలన్నారు. కాకినాడ జిల్లా చల్లూరు తీసుకువెళ్లి వేయింగ్ చేసి రాకంపాడు యార్డుకు తరలించటం నేరమన్నారు. రోజుకు 5 వేల టన్నుల లేటరైట్ తరలిస్తూ కేవలం వెయ్యి టన్నులకు రాయిల్టీ చెల్లిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్నారు. మైనింగ్ ఇష్యూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉందన్నారు. కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ చట్టవిరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారని గణేష్ ఆరోపించారు. అధికార యంత్రాంగం మైనింగ్ విషయాన్ని నీరుగారిస్తే ఆ ప్రాంత గిరిజనులతో సమావేశమై లేటరైట్ తవ్వకాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
డోలీ మోతతో నిరసన తెలుపుతున్న డొంకాడ గిరిజనులు
నర్సీపట్నం: ఈవారం నర్సీపట్నంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్ధ కార్యక్రమం ఫలవంతమైంది. స్వయంగా కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి హాజరు కావడంతో అర్జీదారులు పోటెత్తారు. ఒక దశలో తోపులాట కూడా జరిగింది. మొత్తం 252 వినతులు అందాయి. వివిధ సమస్యలపై పలు సంఘాల వారు నిరసన ప్రదర్శనలు చేశారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గొలుగొండ మండలం, డొంకాడ గ్రామ గిరిజనులు డోలీ మోతతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
పూర్తి వివరాలు 8లో
లేటరైట్ ముసుగులో బాకై ్సట్ దోపిడీ
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే గణేష్

వెల్లువెత్తిన అర్జీలు.. హోరెత్తిన నిరసనలు

వెల్లువెత్తిన అర్జీలు.. హోరెత్తిన నిరసనలు