
అంగన్‌వాడీ కేంద్రాల పరిశీలన
అంగన్‌వాడీ సిబ్బందితో నాగాలాండ్ ప్రనినిధులు
గొలుగొండ: నాగాలాండ్‌కు చెందిన ప్రతినిధుల బృందం సోమవారం పలు అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించింది. అక్కడి పరిస్థితులు, పిల్లలకు అందుతున్న ప్రాథమిక విద్య, పౌష్టికాహార పంపిణీపై బృందం సభ్యులు అధ్యయనం చేశారు. మండలంలోని జోగంపేట–1, –2, అమ్మపేట, ఎ.ఎల్.పురం–6, పప్పుశెట్టిపాలెం అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించి నివేదిక తయారు చేశారు. నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన సీడీపీవో ఎమిలాఎనతన్, సూపర్‌వైజర్ హెకాలి ఎప్తోమి కేంద్రాల్లోని పలు అంశాలపై అధ్యయనం చేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో శ్రీగౌరి, సిబ్బంది పాల్గొన్నారు.