
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
అనకాపల్లి : జీవీఎంసీ విలీన గ్రామమైన కొత్తూరు జాతీయ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఆదివారం రాత్రి గాయపడ్డారు. స్థానికులు కథనం మేరకు వివరాలివి. కొత్తూరు గ్రామానికి చెందిన ఏలూరు వెంకటేష్ జాతీయ రహదారి రోడ్డు దాటుతున్న సమయంలో అనకాపల్లి నుంచి విశాఖ వెళుతున్న ద్విచక్రవాహనదారు వెంకటేష్‌ను ఢీకొట్టడంతో అతనికి ఎడమకాలు విరిగిపోయింది. బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి ముక్కుకు, తలకు తీవ్ర గాయమైంది. హుటాహుటిన ఇద్దరిని 108 వాహనంలో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి రూరల్ పోలీసులు చేరుకున్నారు.