
నూకాలమ్మా.. కరుణించమ్మా..
ఘనంగా గవరపాలెం నూకాంబిక నెల పండగ ముగింపు
అమ్మవారికి కోడిని మొక్కుతున్న మహిళా భక్తురాలు
అమ్మవారి దర్శనానికి
బారులు తీరిన భక్తులు
చలువు పందిళ్లు వద్ద
వంటలు చేస్తున్న భక్తులు
అనకాపల్లి:
ఉత్తరాంధ్ర ఇలవేల్పు, గవరపాలెం నూకాంబిక అమ్మవారి నెల పండగ జాతర ముగింపు కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. అమ్మవారి దర్శనానికి ఉత్తరాంధ్ర జిల్లాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక పూజలు చేశారు. పసుపు, కుంకుమలు, కోళ్లు, పొట్టేలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవదాయ శాఖ ఇన్‌చార్జి సహాయ కమిషనర్ కె.శోభారాణి, ఈవో వెంపలి రాంబాబు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు కుటుంబ సమేతంగా అమ్మవారి ఆలయ సమీపంలో చలువ పందిళ్లు వద్ద వంటలు చేసుకుని అమ్మవారికి మొక్కులు తీర్చుకుని, నైవేధ్యం సమర్పించారు.
ఎన్టీఆర్ క్రీడా మైదానంలో...
స్థానిక ఎన్టీఆర్ క్రీడా మైదానంలో గవరపాలెం నూకాంబిక అమ్మవారి పండగను పురస్కరించుకుని నెల రోజుల పాటు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి నెల పండగ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు సూరే సతీష్, దాడి రవికుమార్, పొలిమేర ఆనంద్, మారిశెట్టి శంకరరావు, కాండ్రేగుల రాజారావు, మజ్జి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి, ఎరవ్రరపు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
క్యూలైన్‌ల్లో భక్తులు

నూకాలమ్మా.. కరుణించమ్మా..

నూకాలమ్మా.. కరుణించమ్మా..

నూకాలమ్మా.. కరుణించమ్మా..

నూకాలమ్మా.. కరుణించమ్మా..

నూకాలమ్మా.. కరుణించమ్మా..

నూకాలమ్మా.. కరుణించమ్మా..