
డిఫెన్స్ మద్యం కలిగిన వ్యక్తి అరెస్టు
నర్సీపట్నం : డిఫెన్స్ మద్యం కలిగిన వ్యక్తిని అరెస్టు చేశామని సీఐ కె.సునీల్ కుమార్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధి పెదబొడ్డేపల్లి శ్రీరామనగర్ కాలనీ ఓ ఇంట్లో డిఫెన్స్ మద్యం నిల్వ చేసినట్లు వచ్చిన సమాచారం మేరకు ఆదివారం దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. వజ్రగాడ గ్రామానికి చెందిన తమరాన అప్పలనాయుడు వద్ద నుంచి 83 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అప్పలనాయుడును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ కిరణ్‌కుమార్, కానిస్టేబుల్స్ లావణ్య, నాగ శంకర్, బాబూరావు, అభిషేక్ ఉన్నారని తెలిపారు.