మూగవేదన | - | Sakshi
Sakshi News home page

మూగవేదన

Apr 28 2025 1:05 AM | Updated on Apr 28 2025 1:05 AM

మూగవే

మూగవేదన

పాడి పశువుల
జిల్లా వ్యాప్తంగా 13 వెటర్నరీ అసిస్టెంటు (ఏడీ) కేంద్రాలు, 67 పశువైద్యశాలలు ఉన్నాయి.
స్పీకర్‌ ఇలాకాలో 4 పశు వైద్యశాలల్లో వైద్యులు లేరు

పాడి రైతును

నిర్లక్ష్యం చేయరాదు..

పాడి పరిశ్రమపై అధిక శాతం రైతులు అధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇప్పు డున్న పరిస్థితిలో వ్యవసాయం కంటే పాడిపై అధిక అదాయం వస్తుంది. పాలు ఇచ్చే పశువుకు అనారోగ్యం వస్తే సకాలంలో వైద్యం అందకపోతే ఆ రైతు తిండి తినడు.. నిద్రపోడు. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. వైద్యులు లేకున్నా సహాయకులు అందుబాటులో ఉన్నా రైతు ధైర్యంగా ఉంటాడు. ఖాళీ పోస్టులు భర్తీ చేసి పాడి రైతుకు దన్నుగా ఉండాలి.

– దస్తాల రాఘవేంద్రరావు, ఉమ్మడి జిల్లా

పశుగణాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌

రైతు గోడు చూస్తే బాధేస్తుంది

పశువైద్యాధికారులు, సహాయకులు సైతం లేకపోవడం వల్ల పశువుకు ఏమీ బాగోకపోయినా మాకు ఫోన్లు చేసి రైతులు రావాలంటున్నారు. మేము కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్లు మాత్రమే చేస్తామన్నా రైతు వినడం లేదు. పశువుకు బాగోక పాలు తగ్గిపోయాయి. వైద్యులు లేరు అదుకోవాలంటూ రైతులు దావేదన చెందుతుంటే చాలా బాధేస్తుంది. సిబ్బంది లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

– కిల్లాడ వెంకటరమణ, గోపాలమిత్రుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జిల్లేడుపూడి గ్రామం

సిబ్బంది కొరత వాస్తవమే

జిల్లా వ్యాప్తంగా పశువైద్యశాఖలో అధికంగా సిబ్బంది కొరత ఉందన్న మాట వాస్తవమే. పాడి రైతులకు ఇబ్బంది లేకుండా ఉన్న సిబ్బందితో పశువులకు సకాలంలో వైద్యసేవలు అందిస్తున్నాం. ప్రభుత్వం పాడి రైతులకు కల్పించే సదుపాయాలు సకాలంలో అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించాం.

– రామ్మోహన్‌రావు,

పశువైద్యశాఖ జేడీ

నాతవరం : జిల్లా వ్యాప్తంగా 13 వెటనరీ అసిస్టెంటు(ఏడీ) కేంద్రాలు 67 పశువైద్యశాలలు ఉన్నాయి. వాటిలో కోటవురట్ల వెటర్నరీ కేంద్రంలో పోస్టు ఖాళీగా ఉంది. ఒక వెటర్నరీ అసిస్టెంటు (ఏడీ) రెండు మండలాలకు పర్యవేక్షిస్తుంటారు. అదే విధంగా 67 పశువైద్యశాలకు 60 మందే పశువైద్యాధికారులు ఉన్నారు. మిగతా ఏడు పశువైద్యశాలలకు వైద్యాధికారులు లేక కేంద్రాలు నిరూపయోగంగా దర్శనమిస్తున్నాయి, వేటర్నరీ అసిస్టెంటు కేంద్రాలు పశు వైద్యశాలలో జిల్లా వ్యాప్తంగా 114 మంది అటెండర్లు (సబ్‌ ఆర్టినేటర్లు) పోస్టులకు కేవలం 38 మాత్రమే పని చేస్తున్నారు. జిల్లాలో 76 పోస్టులు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు జిల్లాలో 48 వెటర్నరీ సహాయకులు పోస్టులకు కేవలం 26మంది మాత్రమే పని చేస్తున్నారు. మిగతా 22 మంది వెటర్నరీ సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్రంలో పశువైద్యాధికారులు లేకున్న సహాయకులు కేంద్రంలో ఉండి సకాలంలో పశువులకు వైద్య సేవలు గతంలో అందించేవారు. అటెండర్లు అవసరమైన సంఖ్యలో లేకపోవడంతో ఏడీలు, పశువైద్యాధికారులు పని చేసే కేంద్రాల్లో వారు చేసే పనులు సైతం అక్కడ అధికారులే చేసుకునే పరిస్ధితులు నెలకొన్నాయి. పశువైద్యాశాలలు, వెటనరీ అసిస్టెంటు కేంద్రాలకు జిల్లా స్థాయి అధికారులు తనిఖీలకు వచ్చేటప్పుడు సొంత ఖర్చుతో అటెండర్లు చేసే పనులకు స్థానికంగా పనిచేసే వారిని ెరోజు వారి కూలీకి పెట్టుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. జిల్లాలోనే అధికంగా స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం నియోజకవర్గంలోనే నలుగురు పశువైద్యాధికారుల పోస్టు లు ఖాళీలు ఉన్నాయి. జిల్లాలో యలమంచిలి నియోజకవర్గంలో సోమలింగపాలెం, దిమిలి, నర్సీపట్నం నియోజకవర్గంలో నర్సీపట్నం మండలంలో వేములపూడి, గొలుగొండ మండలంలో చోద్యం, మాకవరపాలెం మండలంలో బూరుగుపాలెం, నాతవరం మండలంలో శృంగవరం, నాతవరం పశువైద్యాశాలలకు వైద్యాధికారులు లేరు. వైద్యాధికారులతో పాటు సహాయకులు అటెండర్ల పోస్టులు సైతం ఖాళీలు ఉన్నాయి. నాతవరం గ్రామంలో పశువైద్య కేంద్రం ఎప్పుడు చూసినా మూసేసి ఉంటుంది. నర్సీపట్నం డివిజన్‌లో అఽధికంగా పాడి ఉత్పత్తి చేసే రైతులు నాతవరం మండలంలోనే ఉన్నారు. ఇక్కడ పశువులకు ఏ అనారోగ్యం వచ్చినా గోపాలమిత్రులపై ఆధారపడుతున్నారు. పూర్తి స్థాయి అధికారులు లేక ప్రభుత్వం పాడిరైతులకు అందించే రాయితీ విత్తనాలు, ఇతర సదుపాయాలు అందడం లేదని చెబుతున్నారు. పశువుకు ఏరోగం వచ్చిన సకాలంలో వైద్యం అందక ఇటీవల పలు గ్రామాల్లో పశువులు మరణించిన సంఘనలు ఉన్నాయి. వెటనరీ ఏడీలు ఉన్నప్పటికి క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది లేకపోవడంతో మండలాల్లో మొక్కుబడి పర్యటనలు చేసి వెళ్తుంటారు. ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం పెట్టినా పశువైద్య శిబిరం ఏర్పాటు చేసి ఆ రోజున మాత్రమే పశువులను తరలించి ఆర్భాటం చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. పశువులకు మేకలు గొర్రెలు వైద్య సేవలు సకాలంలో అందించే వారు కరువయ్యారు.

జిల్లాలో 114 మంది అటెండర్లకు 38 మంది, పశువైద్య సహాయకులు

48 మందికి 26 మంది మాత్రమే ఉన్నారు

67 పశువైద్యశాలలకు

60 మందే పశువైద్యాధికారులు

మూగవేదన 1
1/4

మూగవేదన

మూగవేదన 2
2/4

మూగవేదన

మూగవేదన 3
3/4

మూగవేదన

మూగవేదన 4
4/4

మూగవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement