అచ్యుతాపురం రూరల్ : పూడిమడక శివారు కడపాలెం గ్రామానికి చెందిన మేరుగు జగన్ (20) సముద్రంలో వేటకు వెళ్లి వల వేస్తుండగా జారి సముద్రంలో పడిపోవడంతో గల్లంతై మృతి చెందినట్లు మత్స్యకారులు తెలిపారు. శుక్రవారం ఉదయం సుమారు 9.30 గంటలకు వెళ్లిన మత్స్యకారులు రాంబిల్లి మండలం వెంకయ్యపాలెం, సీతపాలెం పొరుగు ప్రాంతాల్లో వల వేసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు సముద్రంలో జారి పడిపోయిట్లు మత్స్యకారులు తెలిపారు. జగన్ మృతితో పూడిమడక గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహం గల్లంతవడంతో మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు.