రోలుగుంట: తమకు గుర్తింపుకార్డులు ఇవ్వాలంటూ రోలుగుంటలో గురువారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కులవ్యతిరేక పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు చిరంజీవి పలు సమస్యలపై మాట్లాడారు. నిరుపేదలైన డప్పు కళాకారులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలన్నారు. అలాగే చర్మకారులకు రూ. 6000 పింఛన్ ఇవ్వాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలన్నారు. డప్పు కళాకారులకు గజ్జెల డ్రెస్ ఇవ్వడమే కాకుండా కుట్టు కూలి కూడా ఇవ్వాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలో గల డప్పు కళాకారులు పాల్గొన్నారు.