వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ప్రిన్సిపాల్, నిర్వాహకులు
మాకవరపాలెం : ఈ నెల 16 న జరగనున్న రాష్ట్రస్థాయి చెస్ పోటీల గోడపత్రికలను అవంతి కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌రావు ఆవిష్కరించారు. జిల్లా చెస్ అసోసియేషన్, ప్రగతి చెస్ అకాడమీ సంయుక్తంగా తామరం అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం పోటీల గోడపత్రికను ప్రిన్సిపాల్ ఆవిష్కరించారు. అనంతరం నిర్వాహకుడు సుధీర్ మాట్లాడుతూ ఈ పోటీలలో అన్ని వయసులవారు పాల్గొనవచ్చన్నారు. ఆసక్తిఉన్న వారు ఈ నెల 15లోగా తమ పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9676514520 నంబర్‌ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో డానియల్, అధ్యాపకులు పాల్గొన్నారు.