● డీఈవో గిడ్డి అప్పారావునాయుడు
మాడుగుల: రానున్న విద్యా సంవత్సరంలో నాణ్యమైన విద్యను అందించడానికి క్లస్టర్ కాంప్లెక్స్ పరిధిలో ఉపాధాయులకు ఏటా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు డీఈవో గిడ్డి అప్పారావునాయుడు తెలిపారు. బుధవారం మాడుగుల క్లస్టర్ కాంప్లెక్స్‌లో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధనలో మెలకువలతో పాటు విద్యార్థులకు అర్థమయ్యేలా తరగతులు నిర్వహించడానికి ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని చెప్పారు. మండలంలో మాడుగుల, కేజేపురం, కింతలి క్లస్టర్ కాంప్లెక్స్‌లో 281 మందికి గాను 265 మంది ఉపాధ్యాయలు శిక్షణకు హాజరయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో బి.దేముడమ్మ, డీఈవో అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, కింతలి క్లస్టర్ అబ్జర్వరు రాధాకృష్ణమూర్తి, సీఆర్‌పీలు వొమ్మలి అచ్చుతరావు, బొబ్బిలి హరికృష్ణ, శారద, సురేష్, నిద్దాన సంధ్య, క్లస్టర్ హెచ్‌ఎంలు, రిసోర్స్ పర్సన్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.