పెయ్యిల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

పెయ్యిల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలి

Mar 12 2025 8:16 AM | Updated on Mar 12 2025 8:11 AM

కె.కోటపాడు : పెయ్యిల పెంపకంలో జాగ్రత్తలను పాటించడం వల్ల పెయ్యిల్లో ఎదుగుదల, ఆరోగ్యంగా ఉంటాయని అనకాపల్లి జిల్లా పశుసంవర్ధకశాఖ పశువైద్యాధికారి పి.రామ్మోహన్‌రావు, విశాఖపట్నం ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. మండలంలో చిరికివానిపాలెం, చౌడువాడ గ్రామాల్లో పశుసంవర్ధకశాఖ, పశుగణాభివృద్ది సంస్ధల ఆధ్వర్యంలో మంగళవారం లేగ దూడల ప్రదర్శన నిర్వహించారు. చిరికివానిపాలెంలో 43, చౌడువాడలో 35 పెయ్యిలను ఈ ప్రదర్శనకు రైతులు తీసుకువచ్చారు. మొదటి మూడు స్ధానాలలో ఆరోగ్యకరమైన పెయ్యిలుగా ఎంపికై న వాటి యజమానులకు బహుమతులతో పాటు పోటీలకు పెయ్యిలను తీసుకువచ్చిన రైతులకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా జిల్లా పశువైద్యాదికారి రామ్మోహన్‌రావు, డిప్యూటీ డైరక్టర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ పెయ్యిలకు పుట్టిన 10 రోజులకు ఒకసారి నట్టల నివారణ మందును వేయడంతో పాటు ప్రతి నెలకు ఒకసారి 6 నెలల పాటు నట్టల నివారణ మందును వేయాలని తెలిపారు. ఆవు, గేదెలు ఈనిన 60 రోజుల నుంచి 90 రోజులలోపు చూడికట్టే ఇంజక్షన్‌ను చేయించడం వల్ల చూడికట్టే శాతం మెరుగ్గా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు లవణ మిశ్రమం ప్యాకెట్‌లను ఉచితంగా అందించారు.

కార్యక్రమంలో కె.కోటపాడు పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్‌ డైరక్టర్‌ దినేష్‌కుమార్‌, సౌజన్య, కొరువాడ, చౌడువాడ పశువైద్యాధికారులు సిహెచ్‌.వై.నాయుడు, సింహాచలంనాయుడు, పశువైద్య సహాయకులు పాల్గొన్నారు.

చిరికివానిపాలెం, చౌడువాడ గ్రామాల్లో లేగ దూడల ప్రదర్శన

ఆరోగ్యకరమైన పెయ్యిలకు బహుమతులు

పెయ్యిల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలి 1
1/1

పెయ్యిల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement